అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra | మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpur) సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఆమె భర్త మృతదేహాన్ని బైక్‌పై కట్టుకొని ఇంటికి తీసుకు వెళ్లే యత్నం చేశాడు. రోడ్డు ప్రమాదం (Road Accident)లో భార్య మరణించిన తనకు ఎవరూ సాయం చేయకపోవవడంతో ఇలా తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని సెబోని అనే పట్టణానికి అమిత్ యాదవ్, గయార్సి భార్యాభర్తలు. రక్షాబంధన్ సందర్భంగా, నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న వీరిని ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో గయార్సీ ట్రక్కు చక్రాల కింద పడి మృతి చెందినట్లు అమిత్ తెలిపారు. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చేసుకుంది. అయితే సాయం కోసం వేడుకున్నా.. వాహనదారులు ఎవరూ స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Maharashtra | ఎవరూ ఆపకపోవడంతో..
ఎవరూ తనకు సాయం చేయకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని బైక్ వెనకాల కట్టుకున్నాడు. బైక్‌పైనే మధ్యప్రదేశ్ తీసుకెళ్లేందుకు యత్నించాడు. ప్రమాదం తర్వాత ఎవరూ కారు ఆపి తనకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరని, ఎవరికీ మానవత్వం చూపలేదని అమిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైవేపై వెళ్తుండగా.. పోలీసులు (Police) అతడిని ఆపమని కోరారు. అయితే ఆయన ఆపకుండా అలాగే వెళ్లడంతో.. వాహనాన్ని ఛేజ్ చేసి ఆపారు. అనంతరం మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నాగపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా మహిళ మృతదేహాన్ని బైక్‌పై కట్టి తీసుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి.