అక్షరటుడే, కామారెడ్డి : Jukkal | విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ ఆటో (School Auto) బోల్తాపడి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. జుక్కల్ మండలం సావర్గావ్ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రతిరోజు మాదిరిగానే జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం (Savargaon Village) నుంచి విద్యార్థులను తీసుకుని ఆటో ఖండే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు బయలుదేరింది.
Jukkal | విద్యార్థుల హాహాకారాలు..
గ్రామ శివారులోకి వెళ్లిన తర్వా ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి ప్రణవ్(15) అక్కడికక్కడే మృతిచెందగా మరొక 14 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి (Local Government Hospital) తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.