Brazil | బ్రెజిల్​లో విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి.. ఎనిమిది మంది దుర్మరణం
Brazil | బ్రెజిల్​లో విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయి.. ఎనిమిది మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Brazil : బ్రెజిల్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (జూన్ 21) పర్యాటకులతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఎగురుతూ ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమింది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో హాట్ ఎయిర్ బెలూన్ (hot air balloon)లో మొత్తం 22 మంది పర్యాటకులు (tourists) ఉన్నారు. బ్రెజిల్ దక్షిణ రాష్ట్రం శాంటా కాటరినాలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రియాగ్రాండే (Praia Grande) నగరంలో శనివారం టూరిజం హాట్ ఎయిర్ బెలూన్(hot air balloon)లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి కూలిపోయిందని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఎనిమిది మంది చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.