Homeజిల్లాలుకామారెడ్డిSnake Bite | బాన్సువాడలో విషాదం.. పాముకాటుతో బాలిక మృతి

Snake Bite | బాన్సువాడలో విషాదం.. పాముకాటుతో బాలిక మృతి

బాన్సువాడలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కాలునాయక్​ తండాలో బుధవారం ఓ చిన్నారి పాముకాటుకు బలైంది.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Snake Bite | పాముకాటు బారినపడి బాలిక మృతిచెందింది. ఈ విషాదకర సంఘటన బాన్సువాడ (Banswada) మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

సీఐ తుల శ్రీధర్ (CI Tula Sridhar) తెలిపిన వివరాల ప్రకారం.. పులిగుండు తండా పంచాయతీ పరిధిలోని కాలు నాయక్ తండాకు చెందిన శ్రీకాంత్ కూతురు చౌహన్ సరస్వతి బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు గమనించారు.

సరస్వతి కుడికాలిపై పాముకాటు (Snake Bite) గుర్తులు కనిపించాయి. తక్షణమే కుటుంబ సభ్యులు బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించారు. ప్రాథమిక పరీక్ష అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ జీజీహెచ్​కు (Nizamabad GGH) రిఫర్ చేశారు. మార్గమధ్యంలో దుర్కి వద్ద బాలిక మృతి చెందినట్లు చెప్పారు. తండ్రి చౌహాన్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Must Read
Related News