ePaper
More
    HomeజాతీయంKarnataka | వినాయ‌క నిమ‌జ్జ‌నంలో విషాదం.. శోభాయాత్ర‌పైకి దూసుకెళ్లిన ట్యాంక‌ర్‌.. తొమ్మిది మంది మృతి

    Karnataka | వినాయ‌క నిమ‌జ్జ‌నంలో విషాదం.. శోభాయాత్ర‌పైకి దూసుకెళ్లిన ట్యాంక‌ర్‌.. తొమ్మిది మంది మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | వినాయ‌క నిమ‌జ్జ‌నం(Vinayaka Immersion)లో విషాదం చోటు చేసుకుంది. శోభాయాత్ర‌పై ట్యాంక‌ర్ దూసుకెళ్ల‌డంతో తొమ్మిది మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కర్ణాటక(Karnataka)లోని హసన్ జిల్లాలోని మోసలే హొసహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయ‌క శోభాయాత్ర నిర్వ‌హించారు.

    అయితే, వేగంగా వ‌చ్చిన ట్యాంకర్ జనంపైకి దూసుకెళ్లింది. డ్రైవ‌ర్ (Tanker Driver) నిర్లక్ష్యం వ‌ల్ల వాహ‌నం భక్తులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు(Engineering Students) ఉన్నారు. వాహనం కింద చిక్కుకున్న నలుగురు బాధితులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

    Karnataka | పోలీసుల అదుపులో డ్రైవర్‌

    ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవర్‌ను భువనేష్‌గా గుర్తించారు, అరకలగూడు నుంచి వస్తున్న అత‌డు వేగంగా న‌డ‌ప‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు తెలిపారు. యాక్సిడెంట్ త‌ర్వాత డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ జనం అతన్ని పట్టుకుని, తీవ్రంగా కొట్టి,తరువాత పోలీసులకు అప్పగించారు.

    Karnataka | మృతుల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం..

    ప్ర‌మాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) విచారం వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేస్తుందని, గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ భరిస్తుందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన సిద్ద‌రామ‌య్య‌.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. మ‌రోవైపు, కేంద్ర మంత్రి హెచ్‌డీడి కుమారస్వామి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు.

    More like this

    India vs Pakistan | రేపే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌.. టిక్కెట్ల అమ్మ‌కాలు ఇంత నెమ్మ‌దిగానా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Pakistan | ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో భాగంగా భారత్,...

    Forest Land | మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత.. అటవీ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Land | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట(Dammanapeta)లో శనివారం తీవ్ర ఉద్రిక్తత...

    Warangal Congress | వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. కొండా సురేఖ‌పై పీసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో (Congress Party) విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి....