Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | పండుగ పూట విషాదం.. కారు ఢీకొని ఒకరు మృతి

Nizamabad | పండుగ పూట విషాదం.. కారు ఢీకొని ఒకరు మృతి

Nizamabad | నిజామాబాద్​ నగరంలో విషాదం చోటు చేసుకుంది. బైక్​ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. వినాయక్ నగర్ (Vinayak Nagar)​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ (Mopal) మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) సోమవారం తెల్లవారుజామున బైక్​పై వెళ్తున్నాడు. నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో బోర్గాం వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు అరుణ్​ బైక్​ను ఢీకొంది. కారు డ్రైవర్​ అజాగ్రత్తతో నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అరుణ్​కుమార్​ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.