అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | పండుగ పూట నస్రుల్లాబాద్ మండలంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేందర్ (SI Raghavendra) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకోల్ తండాలో దీపావళి (Diwali) పండుగ సందర్భంగా గుగులోత్ రాదిబాయి (65) పూజ చేస్తోంది.
అయితే అదే గ్రామానికి చెందిన మెగావత్ సవాయిసింగ్ రాదిబాయి ఇంట్లోకి ప్రవేశించాడు. వెనుక నుంచి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం చున్నీతో మెడకు ఉరివేసి ఆమెను హత్యచేశాడు. అనంతరం ఆమెపై ఉన్న ఆభరణాలను తీసుకున్నాడు.
ఆ సమయంలో అడ్డుకోవడానికి యత్నించిన వారిపై కూడా దాడి చేసి ఆభరణాలతో పారిపోయాడు. సమాచారం అందుకున్న బాన్సువాడ (Bansawada) సీఐ తిరుపతయ్య (CI Tirupathaiah), ఎస్సై రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.