అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్వాడిలో (Khaleelwadi) వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మూడురోజులుగా నగరంలోని ప్రధాన రద్దీ ప్రాంతమైన ఖలీల్వాడిలో వన్‌వే ఏర్పాటు చేశామని దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయని ఆయన పేర్కొన్నారు.
CP Sai Chaitanya | గతంలో వాహనదారులకు ఇబ్బందులు..
ఖలీల్వాడిలో నిత్యం అస్తవ్యస్త పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యేదని.. దీంతో రోగులకు, రోగుల బంధువులకు ఇబ్బందులు ఏర్పడేవని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి అంబులెన్స్‌లు సైతం రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఏర్పడిన రోజులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association), మున్సిపల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలతో నిర్వహించిన సమావేశంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై (Traffic regulation) నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిబ్బంది వన్ వే ఏర్పాటు చేశారని వెల్లడించారు.
CP Sai Chaitanya | వాహనదారులకు రూట్ మ్యాప్
ఈమేరకు ఖలీల్వాడిలో వెళ్లివచ్చేందుకు సీపీ ఆధ్వర్యంలో రూట్‌మ్యాప్ విడుదల చేశారు. బీఎస్ఎన్ఎల్ (BSNL Office) సర్కిల్ ఎంట్రీ వద్ద నుండి ఖలీల్ వాడిలోకి వాహనదారులు వెళ్లొచ్చు. ఖలీల్వాడిలో నుండి గ్రంథాలయం మీదుగా.. వెల్నెస్ హాస్పిటల్ పక్కన నలంద కాలేజీ ముందు నుండి బయటకు వెళ్లవచ్చన్నారు.
అలాగే అమృత లక్ష్మి స్కానింగ్ సెంటర్ పక్కన గల్లీ నుండి, సన్రైస్ హాస్పిటల్ పక్కన గల్లీ నుండి బయటకు వెళ్లవచ్చని సూచించారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు వన్ వే ఎంట్రీ, ఎగ్జిట్ అదేవిధంగా వన్‌వే రూట్ మ్యాప్ ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. వాహనాదారులు ఎల్లప్పుడూ పోలీసులకు సహకరించాలని సీపీ పేర్కొన్నారు.