ePaper
More
    HomeతెలంగాణTraffic Police | మహానగరంలో ట్రాఫిక్​ ఉల్లం‘ఘనులు’.. వారం రోజుల్లో ఎన్ని కేసులో తెలిస్తే షాక్​

    Traffic Police | మహానగరంలో ట్రాఫిక్​ ఉల్లం‘ఘనులు’.. వారం రోజుల్లో ఎన్ని కేసులో తెలిస్తే షాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Traffic Police | హైదరాబాద్(Hyderabad)​ మహా నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ట్రాఫిక్​ జామ్(Traffic Jam)​తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.

    అయినా కూడా కొందరు ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం లేదు. రాంగ్​రూట్​లలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అలాంటి వారి ఆట కట్టించడానికి ట్రాఫిక్​ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు(Hyderabad Traffic Police) ఈ నెల 20 నుంచి 26 వరకు వాహనాల తనిఖీ కోసం స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. ఇందులో భాగంగా రాంగ్​రూట్​లో ప్రయాణిస్తున్న 14,917 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే నంబర్​ ప్లేట్​ను కనిపించకుండా చేసిన 3,881 మందిపై కేసు బుక్​ చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

    Traffic Police | వీకెండ్​తో తప్ప తాగి..

    కొందరు తప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ముఖ్యంగా సైబరాబాద్​ కమిషనరేట్ (Cyberabad Commissionerate)​ పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వారాంతంలో మందుబాబులు బాగా తాగి రోడ్లపై రయ్యున దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్​ పోలీసులు శని, ఆదివారాల్లో డ్రంకన్​ డ్రైవ్​(Drunk Driving) స్పెషల్​ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 252 మందిపై కేసులు నమోదు చేసి, వారి వాహనాలను సీజ్​ చేశారు. వీరిలో 21 నుంచి 40 ఏళ్లలోపు వారు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...