అక్షరటుడే, ఇందూరు: MIM Nizamabad | నగరంలోని బోధన్ బస్టాండ్ నుంచి అర్సపల్లి మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీకి(Traffic ACP Mastan Ali) వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ (MIM district president Fayazuddin) మాట్లాడుతూ.. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా బోధన్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారన్నారు. బోధన్ బస్టాండ్, మాలపల్లి ఎక్స్ రోడ్, ధర్మకాంట సమీపంలో, అర్సపల్లి ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరారు. అలాగే బోధన్ రోడ్, ఖిల్లారోడ్లో స్కూళ్లు, మసీదులు ఉన్న చోట్ల జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పలువురు ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.
