అక్షరటుడే, ఎల్లారెడ్డి: Traffic Rules | ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని ఎస్సై మహేష్ (SI Mahesh) అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు పట్టణంలో ఆటోడ్రైవర్లకు ఆదివారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, రహదారి భద్రత, ప్రజల రక్షణకు ఆటోడ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డ్రైవర్లు ఎల్లప్పుడూ డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని.. సౌండ్ బాక్స్‌లు పెట్టకుండా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచనలు చేశారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వినియోగించవద్దని పేర్కొన్నారు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడి వాహనం నడపవద్దని సూచించారు. అలాగే పోలీస్ తనిఖీల సమయంలో సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై–2 సుబ్రహ్మణ్య చారి, హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి, కానిస్టేబుళ్లు రాజేశ్వర్, హోమ్ గార్డ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.