అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ura Panduga | నగరంలో ఊర పండుగ సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ(Traffic ACP Mastan Ali) శనివారం వివరాలు వెల్లడించారు.
Ura Panduga | అమ్మవార్లను ఊరేగించే ప్రాంతాలు..
నగరంలో ఊరపండుగ సందర్భంగా అమ్మవార్లను ఊరేగిస్తారు. ఖిల్లా చౌరస్తా (qilla Chowrasha) నుండి ఉదయం 6 గంటలకు అమ్మవార్ల ఊరేగింపు ప్రారంభం కానుంది. అక్కడి నుంచి వివేకానంద చౌరస్తా గాజులపేట్(Gajulpet), గురుద్వారా మీదుగా ఊరేగింపు వెళ్తుంది. లక్ష్మి మెడికల్ (Laxmi Medical), గోల్ హన్మాన్ (Goal hanuman) వరకు యాత్ర సాగిన అనంతరం అక్కడి నుంచి అమ్మవార్ల ఊరేగింపు రెండుగా మారుతాయి. వినాయక్ నగర్, దుబ్డ ప్రాంతాల వైపు వేర్వేరుగా ఊరేగింపు వెళ్లిన అనంతరం అమ్మవార్లు ఆయా ప్రాంతాల్లోని గద్దెలపై ప్రతిష్టిస్తారు.
Ura Panduga | ఆంక్షలు ఉండే ఏరియాలివే..
పండుగ నేపథ్యంలో.. బోధన్(Bodhan) వైపు నుండి రాకపోకలు సాగించే బస్సులు బోధన్ బస్టాండ్ మీదుగా నెహ్రూపార్క్, గాంధీ చౌక్ మీదుగా బస్టాండ్‌కు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వాహనాలు, బస్సులు ఇదేమార్గంలో వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.