అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | వినాయక చవితి (Vinayaka Chavithi) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) నగరంలో సందడి మాములుగా ఉండదు. ఏ వీధిలో చూసినా భారీ వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి.
తొమ్మిది రోజుల పాటు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నగరంలోని ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
Khairatabad Ganesh | ప్రత్యేక చరిత్ర
ఖైరతాబాద్ (Khairatabad) గణపతికి ప్రత్యేక చరిత్ర ఉంది. యేటా ఇక్కడ భారీ గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది 69 అడుగుల మట్టి గణపతి ప్రతిమ ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈసారి.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో తొలిసారిగా విగ్రహం ప్రతిష్ఠించారు.
Khairatabad Ganesh | ట్రాఫిక్ మళ్లింపు
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడు ఉన్న మార్గాల్లో వాహనాలను అనుమతించారు. ఖైరతాబాద్, షాదన్, నిరంకారి, మింట్, నెక్లెస్ రోటరీ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు. రేస్‌కోర్స్ రోడ్, ఎన్‌టీఆర్ ఘాట్, ఐమాక్స్ లాట్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద తమ వాహనాలను పార్క్ చేయాలన్నారు. భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ఖైరతాబాద్ గణేశుడి వద్దకు రావాలని కోరారు. ఇలా అయితే ట్రాఫిక్ సమస్య ఉండొదని పేర్కొన్నారు.
Khairatabad Ganesh | ధూల్‌పేటలో..
నగరంలోని ధూల్‌పేట (Dhulpeta) గణేశ్ విగ్రహాల తయారీకి ఫేమస్. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో ధూల్‌పేట ప్రాంతంలో ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి 27న రాత్రి పది గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉన్నాయి.