అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగనుంది. వేలాది వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.
నిమజ్జన శోభాయాత్ర (Shobhayatra)లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దీంతో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జన శోభాయత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Ganesh immersion | రెండు రోజుల పాటు
నగరంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 8న ఉదయం 6 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ (Tankbund) వరకు శోభాయాత్ర సాగనుంది. సికింద్రాబాద్-ప్యాట్నీ-రాణిగంజ్-ట్యాంక్‌బండ్,
టోలీచౌకి-మెహిదీపట్నం-ఖైరతాబాద్, టపాచబుత్ర-ఆసిఫ్‌నగర్-ఎంజేమార్కెట్ ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఆయా మార్గాల్లో వినాయక విగ్రహాలు ఉన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
Ganesh immersion | పార్కింగ్ స్థలాలు
ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర తిలకించేందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఆయా ప్రాంతాల్లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
Ganesh immersion | 50 వేల విగ్రహాలు
నగరంలో శనివారం సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 303 కి.మీ.ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. నగరంలోని 20 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే 72 కృత్రిమ కొలన్లను సైతం సిద్ధం చేశారు. భారీ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్‌లో (Hussain Sagar) వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.