అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు ఆమె నగరంలో ఉంటారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం (President Residence)లో విడిది చేయనున్నారు. ఈ క్రమంలోసిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ (CP Joel Davis) తెలిపారు. 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వైజంక్షన్ – బొల్లారం చెక్ పోస్ట్ – రిసాల బజార్– అల్వాల్ టి జంక్షన్ – సత్య పెట్రోల్ పంప్ – లాల్ బజార్ – తిరుమలగిరి ఎక్స్ రోడ్ – హనుమాన్ టెంపుల్ – కార్ఖానా – ఎయిర్టెల్ – ఎన్సీసీ మధ్య ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది. ఈ నెల 22న రాష్ట్రపతి తిరిగి వెళ్లనున్నారు. దీంతో ఆ రోజు పైమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేస్తారు.
Hyderabad | పలు కార్యక్రమాల్లో..
రాష్ట్రపతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో వెళ్లే రూట్లలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. 19న ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు : బైసన్ సిగ్నల్ ఆర్ఎస్ఐ సర్కిల్ – నేవీ హౌస్ – కౌకూర్ రోడ్ – బొల్లారం చెక్ పోస్ట్ – అల్వాల్ రైతు బజార్ – అల్వాల్ టి జంక్షన్ – సత్య పెట్రోల్ పంప్ – హోలీ ఫ్యామిలీ జంక్షన్ – కార్ఖానా – టివోలీ – అలుగడ్డబావి మార్గాల్లో వాహనాలను అనుమతించరు. 20న మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు, 5 నుంచి 6.30 వరకు బైసన్ సిగ్నల్ – ఆర్ఎస్ఐ సర్కిల్ – నేవీ హౌస్ – బొల్లారం చెక్ పోస్ట్ – అల్వాల్ రైతు బజార్ – తిరుమల గిరి ఎక్స్ రోడ్ – ఎన్సీసీ – రసూల్‌పుర – వైట్ హౌస్ – గ్రీన్ ల్యాండ్ జంక్షన్ – – పంజాగుట్ట ఫ్లైఓవర్ – ఫ్లైఓవర్ వై జంక్షన్ – కేబీ ఆర్ జంక్షన్ ఆర్/టి – జిమ్ఖానా – ఫ్లైఓవర్ రోడ్ నం.45 వరకూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు.