అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Traffic Restrictions in City | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ (Nizamabad Traffic police) ఆంక్షలు విధించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, ఆర్మూర్ నుంచి నిజామాబాద్‌కు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బైపాస్ కంఠేశ్వర్, బైపాస్ ఖాజా హోటల్, ఐడీఓసీ, ఖానాపూర్ కాలూర్ జంక్షన్ నుండి దుబ్బా చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుండి శివాజీ విగ్రహం, రైల్వే ఫ్లైఓవర్ గుండా బస్టాండ్ వైపునకు వెళ్లాలి. అలాగే బోధన్, బాన్సువాడ వైపు నుండి వచ్చే వాహనాల రాకపోకల్లో ఎలాంటి మార్పులు లేవు.
Traffic Restrictions in City | నగరవాసులు సహకరించాలి..
ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతమైన పాలిటెక్నిక్ కళాశాల(Polytechnic College) పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున ప్రజలు సహకరించాలని సీపీ సూచించారు. అత్యవసర పరిస్థితిలో వాహనదారులు ఇతర మార్గాలలో ప్రయాణం కొనసాగించాలని సీపీ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది ఉంటారని.. వారికి సహకరించాలని కోరారు.