అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Traffic Police | నగరంలో మట్టిని తవ్వి వదిలేసిన గుంతలను ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) మంగళవారం ఉదయం పూడ్చారు. కేబుల్ ఆపరేటర్లు నగరంలోని దేవీ రోడ్డు(Devi Road), ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గుంతలు తవ్వి వదిలేశారు.
దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తరచూ ఈ గుంతల కారణంగా ప్రమాదాలు సైతం జరిగాయి. ఇది గమనించిన ట్రాఫిక్ సీఐ ప్రసాద్(Traffic CI Prasad) ఆధ్వర్యంలో తన సిబ్బందితో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి(Flyover Bridge)కి ఇరువైపులా ప్రజలకు అంతరాయం వాటిల్లకుండా గుంతలను పూడ్చివేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎప్పుడు రద్దీగా ఉండే దేవి రోడ్డులో గుంతలు ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి.
పండుగ సందర్భంగా షాపింగ్ కోసం నగర ప్రజలు దేవి రోడ్డు గంజ్ వైపు రావడంతో రద్దీ విపరీతంగా ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీసుల స్వయంగా రంగంలోకి దిగి పనులు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ కేశవులు కానిస్టేబుల్ రాజు సాగర్, కిషన్, గోపాల్ సింగ్, దినేష్ లు గుంతలు పూడ్చివేసి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరు పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.