అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic Police | ఫిట్స్ వచ్చి రోడ్డుపై ఓ వ్యక్తి పడిపోగా ట్రాఫిక్ సిబ్బంది స్పందించారు. వెంటనే అతడికి సపర్యలు చేశారు. ఈ ఘటన ఆదివారం కంఠేశ్వర్ టీ జంక్షన్ (Kanteshwar T Junction) వద్ద చోటు చేసుకుంది.
ట్రాఫిక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్ టీ జంక్షన్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) వెంటనే స్పందించారు. హెడ్‌కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శేఖర్ బాబు, దినేష్, మహిళా కానిస్టేబుల్ స్వప్న సదరు వ్యక్తికి సపర్యలు చేశారు. అనంతరం 108 అంబులెన్సును (108 Ambulance) పిలిపించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు (GGH Nizamabad) తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అభినందించారు.