అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic Police | నగరంలోని ఖలీల్వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాక్లూర్ మండలం జ్యోతినగర్‌కు చెందిన సుజాత వైద్యం నిమిత్తం నిజామాబాద్ నగరానికి (Nizamabad City) వచ్చింది. ఈ క్రమంలో ఖలీల్వాడిలో ఆమె తన వద్ద ఉన్న రూ.2వేలను పోగొట్టుకుంది.
అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు (Traffic constables) చిన్నోళ్ల ఉదయ్, గోపాల్‌లకు ఆ డబ్బులు కనిపించగా వాటిని జాగ్రత్తగా ఉంచారు. బాధితురాలు సుజాత తిరిగి ఆ ప్రాంతంలో డబ్బుల కోసం వెతుక్కుంటూ రాగా.. ఆమెను గుర్తించి డబ్బులను తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కానిస్టేబుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిజాయితీగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు ఉదయ్, గోపాల్‌లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.