అక్షరటుడే, బాన్సువాడ: Manjeera River | బీర్కూరు (Birkur) శివారులో వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో బీర్కూర్ నుంచి మంజీర వంతెన మీదుగా రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్సై రాజశేఖర్ (SI Rajashekhar), ఎంపీడీవో మహబూబ్ (MPDO Mahaboob) తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామ పంచాయతీ ట్యాంకర్ను అడ్డుగా పెట్టి రోడ్డును మూసివేశారు.
Manjeera River | పక్క రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
వరదనీటి కారణంగా మంజీర వారధి పైనుంచి మహారాష్ట్ర(Maharashtra), కర్ణాటక (Karnataka), తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు ఈ దారి వైపు రావొద్దని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని, మంజీర నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని ఎస్సై హెచ్చరించారు.