అక్షరటుడే,బోధన్: kanadakurthi | రెంజల్ (Renjal) మండలంలో కందకుర్తి వద్ద గోదావరి (Godavari River) ఉధృతంగా పరవళ్లు తొక్కుతోంది. అలాగే కందకుర్తి వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో నిజాంసాగర్ (Nizamsagar) గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో దిగువకు వరద పోటెత్తుతోంది.
కందకుర్తి వంతెన పైనుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండువైపులా రహదారులను మూసివేశారు. దీంతో రెంజల్ నుంచి ధర్మాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.