అక్షరటుడే, కామారెడ్డి: Traffic jam | భారీ వర్షాలు కామారెడ్డిలో (Kamareddy) అల్లకల్లోలం సృష్టించాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లడంతో రోడ్లపైకి నీరు చేరి రహదారులు దెబ్బతింటున్నాయి.
తాజాగా కామారెడ్డి 44 జాతీయ రహదారిపై (National Highway 44) భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టేక్రియాల్ నుంచి కామారెడ్డి, భిక్కనూరు మండలం జంగంపల్లి వరకు ఒకవైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టేక్రియాల్ బైపాస్ వద్ద అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీళ్లు రోడ్డుపై పారడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు వాహనాలను పంపించి మరోవైపు వాహనాలను నిలిపివేస్తున్నారు. దాంతో వాహనాలు వెళ్లడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. పోలీసులు (police) ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
Traffic jam | కొట్టుకుపోయిన రోడ్లు
భారీ వర్షాలకు జాతీయ రహదారి రోడ్లు కొట్టుకుపోయాయి. టేక్రియాల్ చెరువు (Tekriyal pond) అలుగు పారడంతో బైపాస్ వద్ద రోడ్డు దెబ్బతింది. దాంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుప్రియాల్ వద్ద నీటి ప్రవాహంతో రోడ్డు దెబ్బతినడంతో వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.
Traffic jam | క్యాసంపల్లి, జంగంపల్లి వద్ద..
క్యాసంపల్లి, జంగంపల్లి వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవహంతో రోడ్లు తెగిపోయాయి. ఇప్పటికే జంగంపల్లి వద్ద మరమ్మతులు చేసి నాలుగు లైన్లలో రెండు లైన్లలో మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతించారు. రోడ్డు పునరుద్దరించినా కుంగిపోయినట్టు అధికారులు తెలిపారు. దాంతో అటువైపుగా రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో రహదారి పక్కన నిలబడ్డ ప్రయాణికులు
టేక్రియాల్ వద్ద గండి పడిన ప్రదేశంలో కొనసాగుతున్న మరమ్మతు పనులు
జాతీయ రహదారిపై టేక్రియాల్ వద్ద ట్రాఫిక్ జాం డ్రోన్ వ్యూ