ePaper
More
    HomeతెలంగాణSecunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్​ తిప్పలు.. సికింద్రాబాద్‌ ఎలివేటెడ్​ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

    Secunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్​ తిప్పలు.. సికింద్రాబాద్‌ ఎలివేటెడ్​ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad Elevated Corridor | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్​ వెళ్లేవారు సికింద్రాబాద్​లో ట్రాఫిక్​ జామ్(Secunderabad Traffic jam)​తో అనేక తిప్పలు పడతారు. సికింద్రాబాద్​లోని ప్యారడైజ్​ సర్కిల్(Paradise Circle)​ వద్ద ట్రాఫిక్​ జామ్​ అవుతూ ఉంటుంది.
    ఈ తిప్పలను తప్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎలివేటేడ్​ కారిడార్లను నిర్మించాలని సంకల్పించింది.

    Secunderabad Elevated Corridor | రక్షణశాఖతో ఒప్పందం

    సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌ నుంచి బోయిన్‌పల్లి(Boinpally) వరకు కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది కంటోన్మెంట్​ ల్యాండ్​ కావడంతో చాలా రోజులుగా రక్షణ శాఖ నుంచి అనుమతులు రాలేదు. బీఆర్​ఎస్​ హయాంలోనే ఈ కారిడార్​ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా.. అనుమతులు రాకపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. ఈ కారిడార్‌ కోసం డిఫెన్స్‌ ల్యాండ్‌ కేటాయించింది. ఈ మేరకు ఆదివారం డిఫెన్స్‌ శాఖ, రాష్ట్రప్రభుత్వం మధ్య ఒప్పందం కుదరనుంది.

    Secunderabad Elevated Corridor | ఆదా కానున్న సమయం

    కారిడార్​ నిర్మాణంలో నగరం నుంచి ఉత్తర తెలంగాణ(Telangana) జిల్లాలకు రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు ఎలివేటెడ్​ కారిడార్(Elevated corridor)​ నిర్మిస్తే.. వాహనదారుల సమయం ఎంతో ఆదా కానుంది. ఎక్కడా ట్రాఫిక్​లో ఆగాల్సిన అవసరం లేకుండా.. నగరంలోకి ప్రవేశించవచ్చు. ఆదివారం ఒప్పందం పూర్తయితే హెచ్​ఎండీఏ టెండర్లు(HMDA Tenders) పిలిచే అవకాశం ఉంది.

    కాగా.. ఎలివేటేడ్​ కారిడార్​ కోసం కంటోన్మెంట్​ పరిధిలోని భూములను రక్షణ శాఖ హెచ్​ఎండీఏకు బదిలీ చేయనుంది. దీనికి బదులుగా రక్షణశాఖకు ఇతర ప్రాంతాల్లో భూమి కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూముల వివరాలు.. బదలాయింపులపై రేపు అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నగరవాసులకు ఎంతో మేలు జరగనుంది.

    More like this

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...