అక్షరటుడే, కామారెడ్డి: Traffic diversion : భారీ వర్షాల heavy rains తో కామారెడ్డి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ఆస్తి నష్టం చవిచూశారు.
ఈ నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు వారికి భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం (సెప్టెంబరు 4) కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలో పర్యటించనున్నారు.
సీఎం cm పర్యటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను మల్లిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Traffic diversion : వాహనాల రాకపోకలు ఇలా
- హైదరబాద్ నుంచి పొందుర్తి మీదుగా కామారెడ్డి Kamareddy పట్టణంలోకి వచ్చే వాహనదారులు సిరిసిల్ల బైపాస్ రోడ్ ద్వారా పట్టణంలోకి ప్రవేశం.
- సిరిసిల్ల రోడ్ నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్ళే వాహనాలు రైల్వే స్టేషన్, ఇందిరాచౌక్-పాత బస్టాండు-పంచముఖి హనుమాన్ ఆలయం-రైల్వే గేటు-అశోక్ నగర్ మార్గంలో కొత్తబస్టాండ్.
- కొత్త బస్టాండు నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్లే వాహనాలు మున్సిపల్ ఎదురుగా ఉండు రోడ్ ద్వారా పాత సాయిబాబా ఆలయం-దేవునిపల్లి గ్రామపంచాయతీ-భగత్‌సింగ్ విగ్రహం మార్గం ద్వారా ఎల్లారెడ్డి వైపు.
- కొత్త బస్టాండు నుంచి హైదరబాద్ వైపు వెళ్లే వాహనాలు నిజామాబాద్ వైపు వెళ్లే దారిలో టెక్రియాల్ బైపాస్ రోడ్ 44 వ జాతీయ రహదారి మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు.