అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని మోక్ష్ డ్రెస్సెస్ (Moksh Dresses) ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లు (Traffic Barricades) అందజేశారు. డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ గురువారం ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీని (Traffic ACP Syed Mastan Ali) కలిసి ఈ మేరకు 20 బారికేడ్లు అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బారికేడ్లు ఉపయోగపడతాయన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. అనంతరం మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, శేఖర్, ఎస్సై రహమతుల్లా, ఆర్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
