Homeజిల్లాలునిజామాబాద్​Traffic Police | మానవత్వం చాటిన ట్రాఫిక్ ఏఎస్సై

Traffic Police | మానవత్వం చాటిన ట్రాఫిక్ ఏఎస్సై

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic Police | నగరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై (Traffic ASI) మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కోర్డు సర్కిల్ (Court Circle) వద్ద ఒక వృద్ధురాలు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా అక్కడే ఉన్న ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి(ASI Srinivas Reddy) వెంటనే స్పందించి వృద్ధురాలికి సపర్యలు చేశాడు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న శ్రీనివాస్ రెడ్డిని ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​అలీ (Traffic ACP Mastan Ali), ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Inspector Prasad) అభినందించారు.