అక్షరటుడే, ఇందూరు: Medical College | నిజామాబాద్ మెడికల్ కళాశాల (Nizamabad Medical College) లో ఎలిగ్జర్ 25 అనవయ (Elixir 25 Anavaya) థీమ్‌తో మూడు రోజుల పాటు బెస్ట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.

కళాశాలలో బుధవారం (అక్టోబరు 15) ట్రెడిషనల్ డే జరిపారు. విద్యార్థులు ట్రెడిషనల్ వేర్లో తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ నృత్య కార్యక్రమాలు అలరించాయి.
Medical College | కళాశాల అభివృద్ధికి తోడ్పాటు

నిజామాబాద్ కాలేజీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) హామీ ఇచ్చారు.

తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే క్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పీజీ హాస్టల్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు మరింత బాగా చదువుకునే అవకాశం ఉంటుందని వివరించగా.. ముఖ్యమంత్రి (Chief Minister) తో మాట్లాడి ఏర్పాటుకు పాటుపడతానని సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Medical College | సుదర్శన్ రెడ్డి హయాంలో

సుదర్శన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ కొనియాడారు.

ఆయన చొరవతోనే కళాశాల మంజూరైందని వివరించారు. కళాశాల అభివృద్ధికి ఆయన ఎల్లవేళలా అండగా ఉన్నారన్నారు.

కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మెడికల్ ప్రిన్సిపల్ కృష్ణ మెహన్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

