Homeజిల్లాలునిజామాబాద్​Trade license | ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి : మున్సిపల్‌ కమిషనర్‌

Trade license | ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి : మున్సిపల్‌ కమిషనర్‌

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్‌: Trade license : దుకాణదారులు, వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని భీమ్​గల్ మున్సిపల్‌ కమిషనర్‌ (Bhimgal Municipal Commissioner) గోపు గంగాధర్‌ స్పష్టం చేశారు. పట్టణంలో శుక్రవారం పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణ గదుల కొలతల ఆధారంగా ఆన్‌లైన్‌లో లైసెన్స్‌ జారీ చేస్తామని, విధిగా లైసెన్సులు పొందాలన్నారు.

పునాది పూర్తయితే రూ. లక్ష జమ..

పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) ను కూడా కమిషనర్​ పరిశీలించారు. బేస్‌మెంట్‌ పూర్తయిన ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష నగదు జమవుతుందన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మేనేజర్‌ నరేందర్, వార్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు.