Homeబిజినెస్​Stock Market | ఏటూ తేలని ట్రేడ్‌ డీల్‌.. అనిశ్చితిలో మార్కెట్లు

Stock Market | ఏటూ తేలని ట్రేడ్‌ డీల్‌.. అనిశ్చితిలో మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | యూఎస్‌, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) విషయంలో స్పష్టత రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడుతున్న మిశ్రమ సంకేతాలతో మన మార్కెట్లు స్వల్ప ఒడిదుడుకులతో సాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 119 పాయింట్ల నష్టంతో ప్రారంభమెంది. అక్కడినుంచి 350 పాయింట్లు పడిపోయినా ఆ తర్వాత కోలుకుని 354 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై వెంటనే 86 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 94 పాయింట్లు పెరిగింది.

ఒడిదుడుకుల మధ్య సూచీలు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 70 పాయింట్ల నష్టంతో 82,563 వద్ద, నిఫ్టీ(Nifty) 15 పాయింట్ల నష్టంతో 25,196 వద్ద కొనసాగుతున్నాయి. భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌ ముందుకు సాగడం లేదు. మన వ్యవసాయ, డెయిరీ రంగాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అటు యూఎస్‌ సైతం మొండిగా వ్యవహరిస్తుండడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా తరహాలో భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామన్న ట్రంప్‌(Trump) ప్రకటనతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఒప్పందంపై స్పష్టత వస్తే మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌ను దాటే అవకాశాలున్నాయి.

Stock Market | నష్టాల్లో ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు..

ప్రధాన సూచీలను ఐటీ స్టాక్స్‌(IT stocks) వెనక్కి లాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.71 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) 0.62 శాతం నష్టాలతో ఉండగా.. ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.25 శాతం, సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.21 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.25 శాతం పెరగ్గా.. ఎఫ్‌ఎంసీజీ 0.44 శాతం, హెల్త్‌కేర్‌ 0.43 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.40 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.25 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.21 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.26 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.10 శాతం నష్టంతో ఉంది.

Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో 16 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ట్రెంట్‌ 1.09 శాతం, టాటామోటార్స్‌ 0.83 శాతం, టాటా స్టీల్‌ 0.79 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.77 శాతం, టైటాన్‌ 0.67 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Losers:టెక్‌మహీంద్రా 1.74 శాతం, ఇన్ఫోసిస్‌ 0.71 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.56 శాతం, ఎటర్నల్‌ 0.53 శాతం, ఎల్‌టీ 0.50 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News