అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన బోధన్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం బిక్నెల్లికి (Biknelly) చెందిన బాలాజీ, యాదుతో పాటు రాజు గ్రామ పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఈ ముగ్గురు బయలుదేరారు. కల్దుర్కి సబ్‌స్టేషన్ (Kaldurki Substation) నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తుండగా.. సిద్ధాపూర్(Siddhapur) వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ రాజు స్వల్ప గాయాలతో బయటపడగా.. ట్రాక్టర్‌పై ఉన్న బాలాజీ, యాదులపై ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.