అక్షరటుడే, గాంధారి: Gandhari mandal | చెట్టును ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడగా ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి మండలంలో (Gandhari mandal) మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పేట్సంగం తండా నుంచి చద్మల్ తండాలోని (Chadmal Thanda) లక్ష్మయ్య ఆలయం వద్ద పండుగ చేసుకునేందుకు సుమరు 20 మంది ట్రాక్టర్లో వెళ్తున్నారు.
Gandhari mandal | చెట్టుకు ట్రాక్టర్ ఢీకొని..
ఈ క్రమంలో నేరల్ గ్రామం (Neral village) వద్ద ట్రాక్టర్ చెట్టును ఢీకొని బోల్తా పడింది. ట్రాక్టర్ ఇంజిన్ వద్ద కూర్చున్న వ్యక్తి సంఘటనాస్థలంలోనే మృతి చెందగా మిగితా వారికి గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇవ్వగా వారు క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సైతం ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.