అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా (TPCC General Secretary) నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వరుసగా పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని (Cm revanth reddy) కలిసిన చంద్రశేఖర్ రెడ్డి దంపతులు మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క సూచించినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి (Kamareddy) అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.