అక్షరటుడే, ఇందూరు: Alay Balay | హర్యానా మాజీ గవర్నర్, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ (Former MP Bandaru Dattatreya) సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను (TPCC Chief Mahesh) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన ఆత్మకథ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకాన్ని అందజేశారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో (Nampally Exhibition Grounds) అక్టోబర్ 3న నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ప్రేమ, ఆప్యాయత, సోదరభావాన్ని చాటే ఈ ప్రత్యేక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమానికి తప్పక హాజరవుతానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.