అక్షరటుడే, వెబ్‌బెస్క్: BCCI | టీమ్ ఇండియా అభిమానులకు షాకిచ్చే న్యూస్ ఇది. టీమ్ ఇండియాకు ప్రస్తుతం టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై టీమ్ ఇండియాకు (Team India) స్పాన్సర్‌గా కొనసాగబోమని అధికారికంగా BCCIకి సమాచారం ఇచ్చింది.
దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే డ్రీమ్11 వెనక్కి తగ్గిన అసలు కారణం ఏంటంటే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ బిల్లు కారణంగానే డ్రీమ్11 ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చట్టపరమైన పరిమితుల నేపథ్యంలో తాము ఇక జాతీయ జట్టుకు స్పాన్సర్ చేయలేమని సంస్థ BCCIకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ ఎంపిక కోసం BCCI టెండర్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది.
BCCI | బీసీసీఐ స్పందన..
స్పాన్సర్‌షిప్ (Sponsership) కోసం ఇప్పటికే రెండు సంస్థలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఒకటి టయోటా మోటార్ కార్పొరేషన్, రెండోది ఫిన్‌టెక్ స్టార్టప్. ఒకవైపు గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా, మరోవైపు కొత్తగా ఎదుగుతున్న యువ సంస్థ పోటీలో ఉండడంతో స్పాన్సర్ రేసు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ అధికారికంగా టెండర్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఈ ఏడాది ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై, సెప్టెంబర్ 28న ఫైనల్‌తో ముగియనుంది. ఇప్పటికే డ్రీమ్11 లోగోతో (Dream11 Logo) జెర్సీలు ముద్రించబడ్డాయని, తాజా పరిణామాల కారణంగా ఆ జెర్సీలు ఉపయోగించకపోవచ్చని సమాచారం. కొత్త స్పాన్సర్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో జెర్సీలను తిరిగి ముద్రించే అవకాశం ఉంది.
ఈ విషయమై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా (BCCI Secretary Devajit Saikia) స్పందిస్తూ.. మేం దేశ చట్టాలను గౌరవిస్తాం. అనుమతించని విషయాల గురించి మేం దూరంగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలను పూర్తిగా అనుసరిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆసక్తి అంతా – టీమ్ ఇండియా కొత్త టైటిల్ స్పాన్సర్ (New Title Sponsor) ఎవరు? టయోటా గెలుస్తుందా? లేక ఫిన్‌టెక్ స్టార్టప్ సర్‌ప్రైజ్ ఇస్తుందా ? ఆసియా కప్ మొదలయ్యేలోగా ఈ సస్పెన్స్ తీరనుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది.