ePaper
More
    Homeక్రైంPharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Pharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pharma City | ఆంధ్ర ప్రదేశ్​లోని అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘరో విషాదం చోటు చేసుకుంది. జేఎన్​ ఫార్మా సిటీ (JN Pharma City)లో విషవాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు.

    పరవాడ మండలం జేఎన్ ఫార్మా సిటీలో గల సాయిశ్రేయాస్ ఫార్మా (SS Pharma) కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ విషవాయువులు లీక్​ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి), మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా)గా గుర్తించారు.

    ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...