అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sriram Sagar Project) వద్ద ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. కుటుంబాలు, స్నేహితులతో వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్ అందాలను ఆస్వాదించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల పచ్చదనం, చల్లని గాలులు, నీటి అలల చప్పుళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
Sriram Sagar | కళకళలాడుతున్న జలాశయం
వర్షాలు తగ్గినప్పటికీ ఎగువ నుంచి వరద రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుగా ఉంది. రెండురోజుల క్రితం సైతం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఆదివారం వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. అయితే ప్రాజెక్ట్ను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుండడంతో స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ప్రాజెక్టుపై గుర్రపు స్వారీ (Horse riding) అదనపు ఆకర్షణగా మారింది.
ప్రాజెక్టు దిగువన ఎస్కేస్ గేట్ల వద్ద పర్యాటకుల సందడి
