అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sriram Sagar | కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ్‌సాగర్ (SRSP) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో దిగువకు గోదావరి (Godavari) పరవళ్లు తొక్కుతోంది.
గోదావరి జల సవ్వడులు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు పర్యాటకుల రాకతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అధికారులు పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గేట్ల దగ్గరకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సిబ్బందిని మోహరించారు.