3
అక్షరటుడే,మెండోరా: SriramSagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)పై ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. హాలిడే కావడంతో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు ఎగువ నుంచి పరిమితంగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో మెయిన్ గేట్లను మూసివేసి.. కేవలం ఎస్కేప్ గేట్లను మాత్రమే తెరిచారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఎస్కేప్ గేట్ల నుంచి వస్తున్న నీళ్ల వద్ద పర్యాటకులు సందడి చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు.
SriramSagar Project | ప్రాజెక్టుపై గుర్రం స్వారీ
ఎస్సారెస్పీపై (SRSP) గుర్రపు స్వారీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రాజెక్టుపై రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన కొందరు వ్యక్తులు గుర్రాలను సందర్శకుల కోసం తీసుకొచ్చారు. వాటిపై చిన్నారులను ఎక్కించుకుని ప్రాజెక్టు అందాలను చూపిస్తున్నారు. ఒక్కో రౌండ్‌కు రూ.50 తీసుకుంటున్నారు.


1 comment
[…] శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. […]
Comments are closed.