అక్షరటుడే, మెండోరా : Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) వద్ద పర్యాటకుల సందడి కనిపిస్తోంది. వర్షాకాలం కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. దీంతో ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు(Tourists) తరలివస్తున్నారు.
Sriram Sagar Project | ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం..
ప్రాజెక్టు చుట్టుపక్కల పచ్చదనం, చల్లని గాలులు, నీటి అలల చప్పుళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వీకెండ్ కావడంతో మరింత రద్దీ పెరిగింది. స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు పర్యాటకుల రాకతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. గుర్రపు స్వారీ(Horse Riding) చేసి చిన్నారులు సంబరపడుతున్నారు.
Sriram Sagar Project | అధికారుల అప్రమత్తత
అధికారులు పర్యాటకుల భద్రత(Tourist Safety) కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గేట్ల దగ్గరకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సిబ్బందిని మోహరించారు.