అక్షరటుడే, వెబ్‌డెస్క్: Torrur Municipal Election Tension | మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) తొర్రూర్ పట్టణం యుద్ధభూమిని తలపిస్తోంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తొర్రూర్ మున్సిపాలిటీ (Torrur Municipality)లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే ఛైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) దంపతులు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
Torrur Municipal Election Tension | 500 మందితో బందోబస్తు
తొర్రూర్ పట్టణంలో పోలీసులు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పట్టణంలో ప్రధాన వీధుల్లో ఉదయం కవాతు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తొర్రూర్ పోలీసుల (Thorrur Police) పహారాలో యుద్ధభూమిని తలిపిస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాక్కోవడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి తరలి రావడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడడంతో సత్యవతి రాథోడ్‌ను బీఆర్ఎస్ ఇన్ఛార్జీగా నియమించింది. అయితే పోలీసులు ఆమెను మహబూబాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నిక ఎలా జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మొత్తం 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.