HomeతెలంగాణHyderabad Rains | హైదరాబాద్​లో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

Hyderabad Rains | హైదరాబాద్​లో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ వర్షం (Hyderabad Rains) దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా పారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సెక్రటేరియట్​, ఎల్బీనగర్​, షేక్​పేట, అబ్దుల్లాపూర్​ మేట్​, హయత్​నగర్​, నాగోల్​, బర్కత్​పుర, బండ్లగూడ వనస్థలిపురం వాన దంచికొడుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్​ భారీగా జాం అయ్యింది.

Hyderabad Rains | షేక్​పేట్​లో అత్యధిక వర్షపాతం

షేక్‌పేట్‌లో (Sheikhpet) అత్యధికంగా 7.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ వర్షం కురిసింది. ఇక రాబోయే రెండు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్​కు ఆరెంజ్​ అలర్జ్​ (Orange alert) జారీ చేసింది.

Hyderabad Rains | ప్రజలకు భయటకు రావొద్దని సూచన

రాజ్​భవన్​ ముందు నుంచి భారీగా వరద నీరు పారుతోంది. అలాగే జీడిమెట్ల, కుకట్​పల్లిలలో వరద నీరు ఉధృతంగా పారతోంది. పలుచోట్ల వాహనాలు సైతం కొట్టుకుపోవడం గమనార్హం. నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కుండపోత వర్షం పడడంతో జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్​ బృందాలు అప్రమత్తమయ్యాయి.