Worlds Beautiful Place
Worlds Beautiful Places | ప్రపంచంలో అత్యంత అంద‌మైన దేశాలివే.. టాప్‌ 40లో లేని భార‌త్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Worlds Beautiful Places | ఈ ప్రపంచం మొత్తం కూడా సహజసిద్ధమైన అందాలతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. చాలా దేశాల‌లోని వాతావ‌ర‌ణం, భౌగోళిక స్థితిగతులు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంటాయి. చాలా మందికి ప‌లు దేశాలు వెళ్లి అక్క‌డ అంద‌మైన ప్రదేశాలు ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఉంటుంది. వాటిని చూడడానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు(Tourists) క్యూలు క‌డుతుంటారు. అయితే, అలాంటి దేశాలకు అత్యుత్తమ అందమైన దేశాలుగా ర్యాకింగ్‌లు ఇవ్వడం జ‌రిగింది. భౌగోళిక, వాతావరణ, అక్కడి స్థితిగతులను ఆధారంగా చేసుకొని టాప్ 40 దేశాలు(Top 40 countries) ఏంటో తెలుసుకుందామా.. అయితే ఈ టాప్ 40లో భార‌త‌దేశం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  1. గ్రీస్ – ఏథెన్స్ నగరంగా గ్రీస్‌కు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పురాతనమైన కట్టడాలు, కోటలు
  2. న్యూజిలాండ్ – పచ్చదనపు కొండలు, పల్లెలు
  3. ఇటలీ – రోమన్ చరిత్ర, వెనిస్ జలవీధులు, పిజ్జా పరిమళాలు
  4. స్విట్జర్లాండ్ – మంచు కొండలు, నీలికాంతి సరస్సులు
  5. స్పెయిన్ – ఫ్లామెంకో నృత్యం, మెడ్రిడ్, బార్సిలోనా నగరాలు, మాల్గా, ఇబిజా
  6. థాయ్‌లాండ్ – బీచ్‌లు, దేవాలయాలు.
  7. నార్వే – కొండలు, ఫియోర్డ్స్, గ్లేసియర్స్ మధ్య అంద‌మైన ప్రకృతి..
  8. ఐస్లాండ్ – ఫియోర్డ్స్, నార్తర్న్ లైట్స్
  9. ఆస్ట్రేలియా – గ్రేట్ బారియర్ రీఫ్, అడవుల్లో అబ్బురం
  10. ఆస్ట్రియా – మ్యూజిక్‌తో మేళవించిన కొండ‌లు.
  11. ఐర్లాండ్ – మైమరపించే సుందర ప్రదేశాలు
  12. బ్రెజిల్ – అమెజాన్, రియో బీచ్‌లు, జూఫాల్స్
  13. పోర్చుగ‌ల్ – లిస్బన్, డోరో అల్లు, అజోర్స్ దీవులు
  14. స్వీడన్– స్టాక్‌హోం కోబుల్ హృదయం, నార్త్ కోస్ట్ ప్రకృతి
  15. ట‌ర్కీ – కాపాదోకియా, ఇండో-యూరోపియన్ కలయిక‌
  16. ఈజిప్ట్- చారిత్రాత్మ‌క ప్రాంతాలు
  17. ఫిన్లాండ్ – హెల్సింకి, నార్తర్న్ లైట్స్
  18. కెన‌డా– అడవులు, నయాగరా జలపాతం
  19. మెక్సికో – నేషనల్ పార్కులు, వాటర్ ఫాల్స్, వైల్డ్‌లైఫ్
  20. ఫ్రాన్స్ – పారిస్ గోథిక్ కల్చర్, ప్రావెన్స్ లవెండర్, రివియెరా బీచ్‌లు
  21. నెద‌ర్లాండ్స్ – మ్యూజియాలు, చారిత్ర‌క ప్రాంతాలు
  22. పెరు – మాచుపిచ్చూ మాయాజాలం
  23. జపాన్ – సాకురా, ఆలయాలు, ఆధునికత
  24. కోస్తా రికా- విశిష్ట‌మైన ప్రాంతాలు
  25. డెన్మార్క్ – ఆక‌ట్టుకునే స్థలాలు
  26. అర్జెంటీనా- పటగోనియా, మేండోజా వైన్ రీజియన్‌
  27. ఇండోనేషియా- బాలి, రజా అంపైట్, జావా రుణాలు
  28. క్రొయెషియా – ప్లిట్విసే లేక్‌లు, అడ్రియాటిక్ కోస్ట్
  29. సౌతాఫ్రికా -సఫారి, పింగ్విన్ గుంపులు, కేప్ టౌన్ సుందరం
  30. మోరాకో – బ్లూ సిటీ, ఒజౌడ్ ఫాల్స్
  31. చిలి – ఎడారి, ఐస్ ఫీల్డ్స్
  32. మ‌లేషియా – మలేషియా నగరాలు వాటి చారిత్రాత్మక వాస్తుశిల్పం
  33. సింగ‌పూర్ – మెరీనా బే సాండ్స్, ఐలాండ్
  34. ఫిలిప్పిన్స్ – పలవన్‌ ఘాటు అందాలు, చాకొలెట్ హిల్స్
  35. సైప్ర‌స్ – ఆఫ్రొడైట్స్ రాక్, కోరల్ బే లేదా బ్లూ లగూన్ వంటి బీచ్‌లు
  36. వియ‌త్నాం- హాలాంగ్‌ బే అందాలు
  37. శ్రీలంక – చారిత్రక సుందర ప్ర‌దేశాలు, తై కానివల్స్
  38. డొమినికన్ రిప‌బ్లిక్- పుంటా కానా, డొమినికన్ రిపబ్లిక్‌లో సూర్యుడు, ఇసుక
  39. కొలంబియా- అమెజాన్ అడవులు, కొకోరా వే
  40. లక్సెంబర్గ్ – ఓల్డ్ క్వార్టర్, వియాండెన్ కోట, ముల్లెర్తల్ ప్రాంతం