అక్షరటుడే, ఇందూరు : RSS Nizamabad | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) ఇందూరు నగర పథ సంచలన్ ఆదివారం నిర్వహిస్తున్నట్లు నగర కార్యవాహ అరుగుల సత్యం తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
నగరంలోని చంద్రశేఖర్ కాలనీ (Chandrasekhar Colony) హెచ్పీఎస్ పాఠశాల నుంచి సాయంత్రం 4.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే ఉపనగర సంచలన్ నిర్వహించినట్లు తెలిపారు. మహా పథ సంచలన్ (Mahaa Path Sanchalan)కు నగరంలోని సంఘ్ సభ్యులు పూర్తి గణవేష్తో హాజరుకావాలని ఆయన సూచించారు.
