ePaper
More
    HomeతెలంగాణChepa Prasadam | రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి..

    Chepa Prasadam | రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chepa Prasadam | హైదరాబాద్​(Hyderabad)లో చేప ప్రసాదం పంపిణీకి నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మృగశిర కార్తె(Mrigashira Kaarthe) సందర్భంగా ప్రతి ఏటా బత్తిని గౌడ్​ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న వారు చేప ప్రసాదం తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వస్తారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌(Nampally Exhibition Grounds)లో ఆదివారం, సోమవారం చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు.

    Chepa Prasadam | భారీగా తరలిరానున్న ప్రజలు

    చేప ప్రసాదం స్వీకరించడానికి ఏటా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఈ ఏడాది దాదాపు ఐదు లక్షల మంది వస్తారిన బత్తిని కుటుంబ సభ్యులు అమర్‌నాథ్‌గౌడ్‌, శివశంకర్‌గౌడ్‌, గౌరీశంకర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, సంతోష్‏గౌడ్‌, శివగౌడ్‌ తెలిపారు. అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

    Chepa Prasadam | అధికారుల సమాయత్తం

    ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే గతేడాది క్యూలైన్​లో ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అధికారులు ఈ ఏడాది ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్​ జోన్​ డీసీపీ శిల్పవల్లి(Central Zone DCP Shilpavalli) 21 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...