అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నారు.
ఈనెల 10న జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానం(DSA Ground)లో ఉదయం 11:30కు ఉంటాయని సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు.
ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 12న హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నిఖిల్ 9160036040ను సంప్రదించాలన్నారు.