అక్షరటుడే, వెబ్డెస్క్: Tenth Results | తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలను tenth class results బుధవారం(30వ తేదీన) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పరీక్ష రాశారు. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించనుంది. గతంలో ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇందులో భాగంగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ఇవ్వనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఇటీవల మూల్యాంకనం కూడా పూర్తయింది. కాగా.. గ్రేడింగ్ విధానంపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం state govt కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రేడింగ్ అవసరం లేదని, పాత పద్ధతిలోనే మార్కుల విధానంలో మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై తుది మార్గదర్శకాలు విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలలో కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది.
ఇటీవల కీలక సమీక్ష జరిపిన విద్యాశాఖ education dept మార్కుల విధానంలో మెమోల memo జారీకి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సమయమిస్తే ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా.. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనునుంది.