HomeతెలంగాణKhairatabad Ganesh | రేపు ఉద‌యం ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర .. ద‌ర్శ‌నం ఎప్ప‌టి...

Khairatabad Ganesh | రేపు ఉద‌యం ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర .. ద‌ర్శ‌నం ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Khairatabad Ganesh | ఖైరతాబాద్ బడా గణేష్‌ను చూడాలనుకుంటున్న భక్తులకు ఒక కీలక సమాచారం. గురువారం అర్ధరాత్రి (12 గంటల వరకు) మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ(Khairatabad Ganesh Festival Committee) తెలిపింది.

ఆ తర్వాత శోభాయాత్ర(Shobhayatra) ఏర్పాట్ల కోసం దర్శనాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలు చేయనున్నారు. శనివారం నిమజ్జన వేడుకల నేపథ్యంలో షెడ్లు తొలగింపు, క్రేన్ ఏర్పాట్లు, శోభాయాత్ర రూట్ క్లియర్ చేయడం వంటి పనులు చేపడుతుండటంతో శీఘ్ర దర్శనం, సర్వదర్శనాలను నిలిపివేయనున్నారు. భక్తులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Khairatabad Ganesh | ఇది గ‌మ‌నించ‌గ‌ల‌రు..

ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్‌(Khairatabad Ganesh)ను 30 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక శుక్రవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గణపయ్యను ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్రగా ట్యాంక్ బండ్‌ వైపు తరలించనున్నారు. నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌, ఇందిరా పార్క్, లక్డీకాపూల్, రాణిగంజ్ రూట్లపై ఇప్పటికే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల వందలాది భారీ వాహనాలు, వేల బైకులు తరలిరావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతాల్ని వాహనదారులు అవాయిడ్ చేయడం మంచిది.

భక్తులకు నిర్వాహకులు సూచనలు ఏంటంటే.. ఖైర‌తాబాద్ గ‌ణేషుడిని ద‌ర్శించుకోవాలి అంటే గురువారం అర్ధరాత్రిలోపే రాగలరు. ట్రాఫిక్ సమస్యలను(Traffic Problems) దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గించండి. శనివారం నిమజ్జన వేడుకలకు ముందే మీ పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం ఉత్తమం. విగ్రహాల ఊరేగింపులు, పోలీసు బందోబస్తు(Police Security), వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులు చ‌ర్చ‌లు జ‌రిపి, త‌గు ఏర్పాట్లు చేశారు.గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర చివరిరోజున 30వేల మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్టు సీపీ స్ప‌ష్టం చేశారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ విఘ్నేశ్వరుల శోభాయాత్ర అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్టు పేర్కొన్నారు.

Must Read
Related News