అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tomato virus | కొత్తగా టమోటా వైరస్ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఈ వైరస్ చిన్నారుల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Bhopal)లో పాఠశాల పిల్లల్లో టమోటా వైరస్ విస్తరిస్తోంది. ఈ వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. అనంతరం అవి బొబ్బలుగా మారి దురద, మంట, నొప్పితో బాధపడుతున్నారు. అంతేగాకుండా జ్వరం, గొంతునొప్పి లక్షణాలు సైతం కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీంతో ఈ లక్షణాలతో బాధపడే పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి.
Tomato virus | ఆందోళన అవసరం లేదు..
టమోటా వైరస్‌ను హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్ (HFMD) అంటారని వైద్యులు తెలుపుతున్నారు. కాక్స్‌సాకీ, ఎచినోకాకస్ వైరస్‌తో ఇది వాపిస్తోంది. ఎక్కువగా ఆరు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సోకుతోంది. అయితే దీనిపై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వారం, పది రోజుల్లో తగ్గిపోతుందని పేర్కొన్నారు.
Tomato virus | వ్యాప్తికి కారణాలు
మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవటం, పరిశుభ్రత పాటించకపోవడంతో ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ వచ్చిన వారు దగ్గిన, తుమ్మిన సమయంలో వెలువడే తుంపర్లతోనూ ఇతరకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయట పడుతాయి.