అక్షరటుడే, వెబ్‌డెస్క్: tollywood young directors | కొన్ని ఫొటోలు చూడగానే ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. స్టార్స్ అందరు ఒకే చోట కలిస్తే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి సంఘటనలు కొన్నిసార్లు జరుగుతాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలతో మంచి హిట్స్ (telugu industry small movies with good hits) సాధించి టాప్ డైరెక్టర్స్‌గా (Top Directors) ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. కొందరు ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకోగా, మరి కొందరు మూడు నాలుగు సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్స్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ల జోష్ కనిపిస్తోంది. టాప్ హీరోలు కూడా యంగ్ డైరెక్టర్స్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ (tollywood young directors) అంతా ఒకే చోట కలిసారు.
Tollywood young directors | అదిరిపోయింది..
మరి అందరు ఒక చోట చేరితే ఆ జోష్ మామూలుగా ఉండదు. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నానితో ‘హిట్ 3’ (natural star nani HIT-3) తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ డైరెక్టర్ శైలేష్ కొలను(directore sailesh kolanu).. తన తోటి డైరెక్టర్స్ అందరినీ ఓ చోట కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దర్శకుడు శైలేష్ కొలను (sailesh kolanu) గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేయగా, ఈ పార్టీకి తండేల్ దర్శకుడు చందు మొండేటితో (thandel director chandu) పాటు అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయా (ante sundaraniki director vivek athreya), శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సానా (buchi babu sana), జాతిరత్నలు దర్శకుడు కేవీ అనుదీప్, బేబీ దర్శకుడు సాయి రాజేష్, టక్ జగదీశ్ దర్శకుడు శివ నిర్వాణ(shiva nirvana), విశ్వంభర దర్శకుడు వశిష్ట తదితరులు ఈ వేడుకకు వచ్చి సందడి చేశారు.
కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచిన వ్యక్తులతో నా సక్సెస్ పంచుకోవడం కంటే మంచి మార్గం ఏముంటుంది. టాలీవుడ్ లో (tollywood) మేమంతా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం. ఒకరి యోగక్షేమాలు ఒకరం తెలుసుకుంటుంటాం. సినిమాలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది కుటుంబం అంటే అని శైలేష్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ (photo viral) అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ ‘హిట్’ బొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘హిట్’ ప్రాంఛైజీలో భాగంగా నేచురల్ స్టార్ నాని (natural star nani) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్ 3 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4 రోజుల్లోనే రూ.101 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించారు నాని. రూ.75 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా నిలిచారు.