అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tollywood actress Anasuya | యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి సామాజిక మాధ్యామల వేదికగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే నటుడు శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా తీవ్ర వివాదానికి తెర లేపారు కూడా. దీనికితోడు అనవసర పంచ్‌లు వేయడం ద్వారా హీరోయిన్ రాశికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి సైతం తెచ్చుకున్నారు. తాజాగా అనసూయ మరో సంచలన పోస్టు చేశారు.
Tollywood actress Anasuya | సత్యం మాట్లాడే ధైర్యం..
ఈసారి హీరోయిన్ల విషయంలో కామెంట్స్ పెట్టడం ద్వారా మరో రచ్చకు తెర లేపారు. ఇన్ స్టాగ్రామ్‌లో స్టేటస్ పెడుతూ కథానాయకి అంటే ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. హీరోయిన్ అంటే తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం హీరోయిన్ అంటూ వ్యాఖ్యానించారు. సరైన దానికి నిలబడే గుండె, సొంత దారిలో నడిచే శక్తి .. అదే నిజమైన హీరోయిన్ లక్షణం అంటూ డెఫినేషన్ సైతం ఇచ్చారు. మిగతా వారు కేవలం నటులు మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, ఆమె ఇలా ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారో అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. అనసూయ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.